Breaking News

త్రిష ఆల్‌రౌండ్‌ షో

Published on Thu, 03/27/2025 - 04:07

డెహ్రాడూన్‌: జాతీయ సీనియర్‌ చాలెంజర్‌ ట్రోఫీలో తెలంగాణ ఆల్‌రౌండర్‌ గొంగడి త్రిష (137 బంతుల్లో 93; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సత్తా చాటింది. టీమ్‌ ‘డి’కి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిష... టీమ్‌ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ఎర్రబంతితో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ ‘డి’ 99 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. 

త్రిష త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... ధారా గుజ్జర్‌ (212 బంతుల్లో 103 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగింది. కెప్టెన్‌ స్నేహ్‌ రాణా (28; 3 ఫోర్లు), నందిని (32; 5 ఫోర్లు), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (34 బంతుల్లో 39 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు టీమ్‌ ‘సి’ 405/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

హసబ్నిస్‌ (185 బంతుల్లో 169; 20 ఫోర్లు, 6 సిక్స్‌లు), షఫాలీ వర్మ (104 బంతుల్లో 108; 19 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. టీమ్‌ ‘డి’ బౌలరల్లో త్రిష, కాశ్వీ గౌతమ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న టీమ్‌ ‘డి’... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ధారా గుజ్జర్‌తో పాటు అమన్‌జ్యోత్‌ కౌర్‌ క్రీజులో ఉంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)