Breaking News

ఐదు వికెట్లతో చెలరేగిన శ్రీకాకుళం కుర్రాడు..

Published on Fri, 01/31/2025 - 07:16

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో ఆంధ్ర ఆఫ్‌స్పిన్నర్‌ త్రిపురణ విజయ్‌ (5/62) విజృంభించాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజీత్‌ తోమర్‌ (188 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం చేజార్చుకోగా... మానవ్‌ సుతార్‌ (104 బంతుల్లో 54; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు.

కెప్టెన్‌ మహిపాల్‌ లోమ్రర్‌ (2)తో పాటు కార్తీక్‌ శర (13), సమర్పత్‌ జోషి (8) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్‌ 5 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు రెండు వికెట్లు తీశాడు. పృథ్వీ రాజ్, శశికాంత్, వినయ్‌ కుమార్‌ తలా ఒక వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 8 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఓపెనర్లు వంశీకృష్ణ (23 బంతుల్లో 18 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), శ్రీకర్‌ భరత్‌ (23 బంతుల్లో 26 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.

ఢిల్లీకి ఆడనన్న విజయ్‌..
కాగా  శ్రీకాకుళంకు చెందిన త్రిపురణ విజయ్(Tripurana Vijay) తొలిసారి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో విజయ్‌ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్  కొనుగొలు చేసింది. విజయ్‌, 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, 166 పరుగులు సాధించాడు. రంజీ, కూచ్‌బెహర్‌ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తాక్‌ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ అత‌డిని త‌మ జ‌ట్టులోకి తీసుకుంది.
చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)