Breaking News

పారాలింపిక్స్‌ పతక విజేతలకు సన్మానం

Published on Wed, 09/11/2024 - 02:27

న్యూఢిల్లీ: పారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రోత్సాహకాల్ని అందించింది. స్వర్ణ పతక విజేతకు రూ. 75 లక్షలు... రజత పతకం నెగ్గిన వారికి రూ. 50 లక్షలు... కాంస్య పతకం గెలిచిన వారికి రూ. 30 లక్షలు నజరానా ఇచ్చినట్లు క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 

లాస్‌ ఏంజెలిస్‌ 2028 పారాలింపిక్స్‌ లక్ష్యంగా అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘పారాలింపిక్స్‌లో భారత్‌ దూసుకెళుతోంది. రియో (2016)లో 4 పతకాలు, టోక్యో (2020)లో 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు పారిస్‌లో అత్యధికంగా 29 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచారు. 

భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అథ్లెట్లకు అధునాతన సదుపాయాలు, కిట్లు అందజేస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆదివారం ముగిసిన పారిస్‌ పారాలింపిక్స్‌ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు 29 పతకాలు నెగ్గారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలున్నాయి. 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)