జీరో దగ్గర వదిలేశాడు.. ఏకంగా విధ్వంసం సృష్టించేశాడు! వీడియో వైరల్‌

Published on Sun, 01/21/2024 - 11:24

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్-2024లో దుబాయ్‌ క్యాపిటిల్స్‌ శుభారంభం చేసింది. శనివారం ఎంఐ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  దుబాయ్ క్యాపిటల్స్ కేవలం  16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

దుబాయ్‌ క్యాపిటల్స్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్భాజ్‌(81) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. అంతకముందు బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కొంపముంచిన ట్రెంట్‌ బౌల్ట్‌..
దుబాయ్‌ క్యాపిటిల్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్బాజ్‌కు ఆరంభంలోనే ముంబై పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఓ అవకాశమిచ్చేశాడు. సున్నా పరుగుల వద్ద గుర్బాజ్‌ ఇచ్చిన ఈజీ రిటర్న్‌ క్యాచ్‌ను బౌల్ట్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు ఎంఐ ఎమిరేట్స్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత గుర్భాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

బౌండరీల వర్షం కురిపించాడు. గుర్బాజ్‌ ఏకంగా 81 పరుగులతో విజయాన్ని ముంబైకు దూరం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఒక వేళ గుర్భాజ్‌ క్యాచ్‌ను బౌల్ట్‌ పట్టివుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌల్ట్‌ విడిచిపెట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)