Breaking News

సూపర్‌ సబలెంకా

Published on Mon, 01/06/2025 - 04:28

బ్రిస్బేన్‌: గత ఏడాదిని ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించిన బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ సబలెంకా కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) బ్రిస్బేన్‌ ఓపెన్‌–500 టోర్నీలో టాప్‌ సీడ్‌ సబలెంకా విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన సింగిల్స్‌ ఫైనల్లో సబలెంకా 4–6, 6–3, 6 2తో ప్రపంచ 107వ ర్యాంకర్, క్వాలిఫయర్‌ పొలీనా కుదెర్‌మెతోవా (రష్యా)పై గెలిచింది. 

విజేతగా నిలిచిన సబలెంకాకు 1,92,475 డాలర్ల (రూ. 1 కోటీ 65 లక్షలు)ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. కుదెర్‌మెతోవాతో జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయినా... నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాత వరుసగా రెండు సెట్‌లను సొంతం చేసుకుంది. 1 గంట 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది. 

తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. కుదెర్‌మెతోవా ఆరు ఏస్‌లు సంధించినా... తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. టోర్నీ మొత్తంలో కేవలం ఒక సెట్‌ను కోల్పోయిన సబలెంకా తాజా విజయంతో కెరీర్‌లో 18వ సింగిల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సబలెంకా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)