Breaking News

WPL 2024: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు? 

Published on Fri, 03/15/2024 - 02:46

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై టైటిల్‌ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్‌లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్‌ చేరేందుకు తహతహలాడుతోంది.

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్‌ ఫైనల్‌ పునరావృతం అవుతుంది. ఇక ఈ  సీజన్‌ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్‌ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్‌ జెయింట్స్‌లపై వరుస విజయాలతో టచ్‌లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్‌లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ఆర్‌సీబీ స్టార్‌ ఎలీస్‌ పెరీ ఆల్‌రౌండ్‌ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్‌తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్‌తో రిచా ఘోష్‌ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్‌లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్‌లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను మినహాయించి ఓవరాల్‌గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్‌ చాంపియన్‌ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది.

హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్‌ బ్రంట్, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్‌లతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌ విభాగంలో స్పీడ్‌స్టర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్‌లో లీగ్‌ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)