Breaking News

తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Sun, 01/26/2025 - 08:32

చెపాక్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భార‌త యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్ష్య చేధ‌న‌లో క్ర‌మం త‌ప్ప వికెట్లు ప‌డిన‌ప్ప‌టికి తిల‌క్ మాత్రం త‌న విరోచిత పోరాటం క‌న‌బ‌రిచాడు. ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి భార‌త్‌కు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు.

తిలక్‌ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో  భారత్‌ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ తిల‌క్ వ‌ర్మ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. తిల‌క్ వ‌ర్మ గ‌త నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల‌లో ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు.

త‌ద్వారా టీ20ల్లో రెండు డిస్మిసల్స్(ఔట్‌లు) మ‌ధ్య అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా తిల‌క్ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌​ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్‌మన్ పేరిట ఉండేది. చాప్‌మాన్ టీ20ల్లో రెండు ఔట్‌ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో  చాప్‌మన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు.

టీ20ల్లో రెండు ఔట్‌ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
318 తిలక్ వర్మ (107*, 120*, 19*, 72*)
271 మార్క్ చాప్‌మన్ (65*, 16*, 71*, 104*, 15)
240 ఆరోన్ ఫించ్ (68*, 172)
240 శ్రేయాస్ అయ్యర్ (57*, 74*, 73*, 36)
239 డేవిడ్ వార్నర్ (100*, 60*, 57*, 2*, 20)

ఇ​క ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.  ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్‌ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడారు.

భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్‌లో జరగనుంది.
చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్‌.. ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)