Breaking News

ప్రజ్ఞానందకు మూడో స్థానం

Published on Sun, 09/10/2023 - 01:14

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ చెస్‌ ఓపెన్‌ బ్లిట్జ్‌ టైటిల్‌ను అలెగ్జాండర్‌ గ్రిషుక్‌ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్‌కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్‌ బ్లిట్జ్‌ చాంపియన్‌ అయిన గ్రిషుక్‌ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్‌లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అబ్దుస్సతరోవ్‌ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్‌ సంచలనం ఆర్‌.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది.

ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్‌ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్‌ గుజరాతీ (7వ), డి.గుకేశ్‌ (8వ) టాప్‌–10లో ముగించారు. నాలుగు రౌండ్‌లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్‌ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్‌వన్‌ గుకేశ్‌ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు.  18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌ చెస్‌ టోర్నీ ఫైనల్లో కార్ల్‌సన్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.    

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)