చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్‌ క్రికెట్‌ జట్టు

Published on Fri, 06/13/2025 - 11:13

అంతర్జాతీయ వన్డేల్లో క్రికెట్‌ పసికూన నెదర్లాండ్స్‌ సంచనలం సృష్టించింది. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 2023-27లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యాన్ని డచ్‌ టీమ్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. వన్డేల్లో టాప్‌-2 లక్ష్య ఛేదన రికార్డులు సౌతాఫ్రికా పేరిట నమోదై ఉన్నాయి.

వన్డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు..

2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438/9 (లక్ష్యం 435)

2016లో డర్బన్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 372/6 (లక్ష్యం 372)

2025లో డండీలో స్కాట్లాండ్‌పై నెదర్లాండ్స్ 374/6 (లక్ష్యం 370)

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. ఓపెనర్‌ జార్జ్‌ మున్సే అతి భారీ శతకంతో (191) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ క్రాస్‌ (59) అర్ద సెంచరీతో రాణించగా.. చార్లీ టియర్‌ 23, బ్రాండన​్‌ మెక్‌ముల్లెన్‌ 21, లియామ్‌ నేలర్‌ 14, ఫిన్లే మెక్‌క్రీత్‌ 9, మైఖేల్‌ లీస్క్‌ 28 (నాటౌట్‌), మార్క్‌ వ్యాట్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు.

అనంతరం బరిలో​​కి దిగిన నెదర్లాండ్స్‌.. మ్యాక్స్‌ ఓడౌడ్‌ (158) అజేయ శతకంతో విరుచుకుపడటంతో 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో తేజ నియమానూరు (51), నోవా క్రోయిస్‌ (50) అర్ద సెంచరీలతో రాణించగా.. మైఖేల్‌ లెవిట్‌ 44, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 32 పరుగులతో పర్వాలేదనిపించారు.

గతంలో తృటిలో మిస్‌ అయ్యింది..! 
నెదర్లాండ్స్‌ టీమ్‌ 2023లోనే ఈ రికార్డును తృటిలో మిస్‌ అయ్యింది. నాడు విండీస​్‌ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ సమం చేసింది. ఫలితంగా ఆ మ్యాచ్‌ టై అయ్యింది. సూపర్‌ ఓవర్‌లో నెదర్లాండ్స్‌ గెలిచినా అది విజయవంతమైన రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా పరిగణించబడలేదు.

వన్డేల్లో నెదర్లాండ్స్ బ్యాటర్‌ ద్వారా అత్యధిక వ్యక్తిగత స్కోరు..

158* - మాక్స్ ఓ'డౌడ్ వర్సెస్ స్కాట్లాండ్, డండీ, 2025

137* - వెస్లీ బరేసి vs కెన్యా, లింకన్‌, 2014

134* -  క్లాస్-జాన్ వాన్ నూర్ట్‌విజ్క్ vs నమీబియా, బ్లూమ్‌ఫోంటెయిన్‌, 2003

123 - బాస్ డి లీడే vs స్కాట్లాండ్, బులవాయో, 2023

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)