Breaking News

ప్రేమించేటపుడు వెంటపడతారు.. పెళ్లైన తర్వాత అంతే ఇక.. ఆ రొమాన్స్‌: సాక్షి ధోని

Published on Thu, 07/27/2023 - 18:55

MS Dhoni- Sakshi Dhoni: ‘‘ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. నిజానికి మగవాళ్లు తొలుత తాము ప్రేమించిన అమ్మాయిల వెంట పడతారు.. పెళ్లైన తర్వాత మాత్రం.. ‘ఓకే! ఇప్పుడు ఈమె నాదైపోయింది. ఇంకెక్కడికి పోతుందిలే! అన్న ధోరణిలో ఉంటారు. అలా కంఫర్ట్‌ జోన్‌లోకి వెళ్లిపోతారు. ఇక మా విషయానికొస్తే.. రోజంతా గొడవ పడుతూనే ఉంటాం(సరదాగా)..

ఎప్పుడో ఓసారి మాత్రమే రొమాన్స్‌ ఉంటుంది. అయితే, రొమాన్స్‌ జరిగినంత మాత్రాన ఆ చిన్న చిన్న గొడవలు సమసిపోవు. మళ్లీ ఆటపట్టించుకోవడాలు.. స్నేహపూర్వక సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలాగే ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సతీమణి సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సినీ నిర్మాతగా కొత్త ప్రయాణం
తమ వైవాహిక బంధం గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. కాగా ధోని ఎంటర్టైన్‌మెంట్‌ పేరిట ఎంఎస్‌ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ బ్యానర్‌పై సాక్షి నిర్మాతగా LGM(Lets Get Married) పేరిట తొలి సినిమాను తెరకెక్కించారు. వికాస్‌ హసిజా ఈ మూవీకి మరో నిర్మాత. ఈ నేపథ్యంలో LGM ప్రమోషన్లలో భాగంగా సాక్షి ధోని మీడియాతో ముచ్చటించింది. 

13 ఏళ్ల వైవాహిక బంధం
ఈ సందర్భంగా ధోనితో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆమె ఏమాత్రం తొణక్కుండా మిస్టర్‌ కూల్‌తో తాను ఎలా ఉంటానన్న విషయాన్ని బయటపెట్టింది. కాగా 2010, జూలై 4న సాక్షి- ధోనిల వివాహం జరిగింది. ఇటీవలే 13వ పెళ్లిరోజు జరుపుకొన్న ఈ జంటకు కూతురు జీవా సంతానం. 

అన్యోన్యంగా ఉంటూ
2015లో జీవాకు జన్మనిచ్చిన ధోని దంపతులు.. ఎప్పటికప్పుడు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ధోనికి ఏమాత్రం విరామం దొరికినా రాంచిలోని తమ ఫామ్‌హౌజ్‌లో కుటుంబంతో గడుపుతాడు. అన్యోన్య దంపతులుగా ధోని- సాక్షిలకు పేరుంది.

ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ధోనిది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తలా.. కోలీవుడ్‌తో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఇలా మరోసారి చాటుకున్నాడు.

చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్‌! ఘాటు రిప్లైతో నోరు మూయించి.. 
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు