MS Dhoni: ఓటేసిన ధోని.. వీడియో వైరల్‌

Published on Sat, 05/25/2024 - 15:35

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్‌ జరుగుతోంది.

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్‌లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

భారీ భద్రత నడుమ ఓటేసిన ధోని
ఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్‌ రీజన్‌’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్‌ బాదాడంటూ ఫొటోను షేర్‌ చేసింది.

ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌,‌ గౌతం గంభీర్‌, రెజ్లర్‌ బబితా ఫొగట్‌ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండానే
ఇక ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కొనసాగాడు.

వింటేజ్‌ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు సాధించాడు.

అయితే, డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్‌ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)