Breaking News

అజేయంగా కెరీర్‌కు వీడ్కోలు

Published on Thu, 12/18/2025 - 10:47

న్యూయార్క్‌: అమెరికా ప్రొఫెషనల్‌ బాక్సర్‌ టెరెన్స్‌ క్రాఫోర్డ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో పోటీపడిన 42 బౌట్‌లలోనూ విజయాలు సాధించిన 38 ఏళ్ల క్రాఫోర్డ్‌... ఈ ఏడాది సెపె్టంబర్‌లో చివరిసారి బరిలోకి దిగాడు. నాలుగు వేర్వేరు విభాగాల్లో టైటిల్స్‌ నెగ్గిన ఈ అమెరికా బాక్సర్‌... అపజయమన్నదే లేకుండా బుధవారం కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ‘ప్రతి బాక్సర్‌కు ఇలాంటి ఒక సమయం వస్తుంది. కెరీర్‌లో ఎన్నో సాధించా. ఏమీ లేకుండా రింగ్‌లో అడుగుపెట్టా. ఒక దశలో కేవలం గ్లౌవ్స్‌ ఉంటే చాలు అనే దగ్గరి నుంచి అన్నీ సమకూరే స్థాయికి చేరుకున్నా. 

మొదట్లో కుటుంబం కోసం బాక్సింగ్‌ను ఎంచుకున్నా... ఆ తర్వాత అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నా. బాక్సింగ్‌ నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు వీడ్కోలు పలకాల్సిన సమయం వచి్చంది’ అని క్రాఫోర్డ్‌ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. 2008లో ప్రొఫెషనల్‌గా మారిన క్రాఫోర్డ్‌... కెరీర్‌లో 31 నాకౌట్‌ విజయాలు సాధించడం విశేషం. చివరగా కానెలో అల్వరెజ్‌పై విజయం సాధించిన క్రాఫోర్డ్‌ కెరీర్‌లో లైట్‌ వెయిట్, సూపర్‌ లైట్‌ వెయిట్, వెల్టర్‌ వెయిట్, సూపర్‌ వెల్టర్‌ వెయిట్‌ విభాగాల్లో పోటీ పడి విజయాలు సాధించాడు.   

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)