Breaking News

సినెర్‌కు శిక్ష లేదా!

Published on Thu, 08/22/2024 - 05:56

వాషింగ్టన్‌: వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)ని పెద్ద వివాదం చుట్టుముట్టింది. అతను రెండుసార్లు స్టెరాయిడ్‌ పరీక్షల్లో విఫలమైనా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ ఇతర ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. సినెర్‌ను పోటీల్లో ఇంకా ఎలా ఆడనిస్తున్నారని ప్రశ్నించిన వారు... అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శించారు. 

ఈ ఏడాది మార్చిలో నిషేధిత అనబాలిక్‌ ఉ్రత్పేరకాన్ని తీసుకున్నందుకు రెండుసార్లు సినెర్‌ ‘పాజిటివ్‌’గా తేలాడు. అయితే మంగళవారం వరకు కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచారని, ఈనెల 26 నుంచి జరిగే యూఎస్‌ ఓపెన్‌లో అతడిని ఎలా అనుమతిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు’ అంటూ షపవలోవ్‌ (కెనడా) ట్వీట్‌ చేయగా... ఇలాంటి పనికి నిషేధం తప్ప మరో శిక్షే లేదని నిక్‌ కిరియోస్‌ (ఆ్రస్టేలియా) తీవ్రంగా స్పందించాడు.  

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన సినెర్‌ జూన్‌లో వరల్డ్‌ నంబరవన్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చేతికి గాయాలు తగిలినప్పుడు లేదా కోసుకుపోయినప్పుడు వాడే ఆయింట్‌మెంట్, స్ప్రేలలో ఉండే ‘క్లోస్టెబల్‌’ స్పోర్ట్స్‌ నిషేధిత జాబితాలో ఉంది. మార్చిలో ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ సమయంలోనూ, టోర్నీ ముగిసిన వారం తర్వాత సినెర్‌ ఇచ్చిన శాంపిల్స్‌లో ఈ ఉత్రే్పరకం ఉన్నట్లు తేలింది. దాంతో ఈ టోర్నీలో సినెర్‌ సెమీస్‌ చేరడం ద్వారా వచ్చిన 3,25,00 డాలర్ల ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతోపాటు 400 పాయింట్లలో కూడా కోత విధించారు. 

దీనిపై అప్పీల్‌ చేసిన సినెర్‌ తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని, దానిని వాడిన ఫిజియోథెరపిస్ట్‌ మసాజ్‌ చేసిన కారణంగా తన శరీరంలోకి ప్రవేశించిందని, ఇక ముందు అలా జరగకుండా డోపింగ్‌ నిబంధనలు పాటిస్తానని స్పష్టం చేశాడు. అతని వాదనను అంగీకరిస్తూ టెన్నిస్‌ ఇంటి గ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) సినెర్‌ తప్పేమీ లేదంటూ క్లీన్‌ చిట్‌ కూడా ఇచి్చంది. అయితే తాజాగా ‘దురదృష్టకర ఘటనను మరిచి ముందుకు సాగుతాను’ అని సినెర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. 

ఇలాంటి విషయాలను సాధ్యమైనని ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచి, అంతా మరచిపోయేలా చేస్తూ అగ్రశ్రేణి ఆటగాళ్లను రక్షించడం కొత్త కాదని... అదే ఏ 400వ ర్యాంక్‌ ప్లేయర్‌ అయిఉంటే అది సాధ్యం కాదని మాజీ ప్లేయర్, టెన్నిస్‌ దిగ్గజం క్రిస్‌ ఎవర్ట్‌ కూడా అభిప్రాయపడింది. మున్ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరం.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)