Breaking News

టెన్నిస్‌ టోర్నమెంట్‌.. హెలికాప్టర్లలో స్టేడియానికి

Published on Sat, 09/14/2024 - 09:19

గ్వాడలహారా (మెక్సికో): ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు టోర్నీ నిర్వాహకులు ఏకంగా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో ప్రస్తుతం డబ్ల్యూటీఏ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌ జరుగుతోంది.

ఇక్కడ తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హోటల్స్‌ నుంచి ప్లేయర్లను నిరీ్ణత సమయంలోగా స్టేడియానికి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గంలో కుదరదని భావించిన గ్వాడలహారా టోర్నీ ఆర్గనైజర్లు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.

దీనిపై టోర్నీ డైరెక్టర్‌ గుస్టావో శాంటోస్‌కాయ్‌ మాట్లాడుతూ ప్లేయర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్రీడాకారిణులు కూడా ఈ తరహా రవాణా అనుభవాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. 

‘ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టోర్నీల్లో అప్పుడప్పుడు ప్లేయర్లను ఇలా హెలికాప్టర్లలో వేదిక వద్దకు తీసుకొస్తారు. కానీ రెగ్యులర్‌గా మాత్రం ఈ సదుపాయం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిసారి ప్లేయర్లను చాపర్లలోనే హోటల్‌ గదుల నుంచి టెన్నిస్‌ కోర్టులకు తీసుకొస్తున్నారు’ అని డబ్ల్యూటీఏ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ అలెక్స్‌ ప్రియర్‌ తెలిపారు. 

ఆకాశ మార్గాన త్వరితగతిన వేదికకు చేరుకోవడం ద్వారా ప్లేయర్లంతా ఎలాంటి ప్రయాణ బడలిక లేకుండా మ్యాచ్‌ల బరిలోకి దిగుతున్నారు. గ్వాడలహారా సబర్బన్‌ సిటీలో రోడ్డు మార్గాలన్నీ రద్దీగా ఉంటాయి. 

ప్లేయర్లు బస చేసే హోటల్స్‌ నుంచి టోర్నీ వేదికకు మధ్య దూరం 11 కిలో మీటర్లు ఉంటుంది. అయితే ఈ మాత్రం దూరానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టడంతో నిర్వాహకులు చాపర్లను అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల నాలుగైదు నిమిషాల్లోనే క్రీడాకారిణులు స్టేడియానికి చేరుకుంటున్నారు.
చదవండి: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ కన్నుమూత..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)