Breaking News

ఏడు ఇన్నింగ్స్‌లో 752 రన్స్‌.. అసాధారణం: సచిన్‌ టెండుల్కర్‌

Published on Sat, 01/18/2025 - 11:39

భారత క్రికెటర్‌ కరుణ్‌ నాయర్‌(Karun Nair)పై టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌(Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదడం గాలివాటం కాదని.. కఠోర శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. కరుణ్‌ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సచిన్‌ ఆకాంక్షించాడు.

ఐదు సెంచరీల సాయంతో
కాగా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్‌ నాయర్‌ దేశవాళీ క్రికెట్‌లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2023-24 సీజన్‌ నుంచి అతడు విదర్భకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy) సీజన్‌లో 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

యాభై ఓవర్ల ఫార్మాట్లో కరుణ్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా 752 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. ఏడు ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలవడం మరో విశేషం. ఇక కెప్టెన్‌గానూ కరుణ్‌ నాయర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. బ్యాటర్‌గా ఆకట్టుకుంటూనే సారథిగానూ సరైన వ్యూహాలతో విదర్భను తొలిసారి ఈ వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేర్చాడు.

ఈ నేపథ్యంలో కరుణ్‌ నాయర్‌కు టీమిండియా సెలక్టర్లు పిలుపునివ్వాలని.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి అతడిని ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్‌ టెండుల్కర్‌ సైతం కరుణ్‌ నాయర్‌ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో
‘‘కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాల సాయంతో 752 పరుగులు.. ఇది అసాధారణ విషయం కరుణ్‌ నాయర్‌!.. ఇలాంటి ప్రదర్శనలు కేవలం ఒక్కరోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావం, దృష్టి ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదే తీరుగా ధైర్యంగా ముందుకు వెళ్లు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో’’ అని సచిన్‌ టెండ్కులర్‌ ‘ఎక్స్‌’ వేదికగా కరుణ్‌ నాయర్‌ను అభినందించాడు.

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం జట్టును ప్రకటించనుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ జట్టు వివరాలను వెల్లడించనున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ టోర్నీ ఆడతాడా? లేదా? అన్నది ఈ సందర్భంగా తేలనుంది.

నా  అంతిమ లక్ష్యం అదే
ఇక చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు కరుణ్‌ నాయర్‌కు అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బలంగా తన గొంతును వినిపించాడు. అయితే, మరో భారత మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ మాత్రం కరుణ్‌ను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేదంటూ కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే.. పరుగుల వరద పారిస్తున్న కరుణ్‌ నాయర్‌ మాత్రం తనకు మరోసారి భారత్‌ తరఫున ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.

‘‘దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. నా కల కూడా ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేను ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియాలో అడుగుపెడతా. నా ఏకైక, అంతిమ లక్ష్యం అదే’’ అని కరుణ్‌ నాయర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఎనిమిదేళ్ల క్రితం
కాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కరుణ్‌ నాయర్‌ చివరగా 2017లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్‌ తరఫున ఆరు టెస్టులు ఆడిన కరుణ్‌ నాయర్‌ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి, ఇందులో త్రిబుల్‌ సెంచరీ(303) ఉంది. ఇక రెండు వన్డేలు ఆడిన కరుణ్‌ నాయర్‌ కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.

చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్‌ చేయండి: సెహ్వాగ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)