Breaking News

తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ పేరిట అక్ర‌మాలు

Published on Wed, 09/17/2025 - 19:43

తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం అధ్య‌క్షుడు డి.సాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సంబంధం లేని వ్యక్తులు న‌కిలీ ప‌త్రాలు, ఫోర్జ‌రీ సంతకాల‌తో తమ సంఘాన్ని క‌బ్జా చేశారని ఆరోపించారు. కోదాడకు చెందిన శ్రుతి అనే మహిళ తమ సంఘం పేరిట అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. 

తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘంతో సంబంధమే లేని ఆమె.. నకిలీ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో వేసిన అడ్‌హక్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్న సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్‌రాజ్‌తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

సభ్యత్వమే లేని సంఘాలకు ఓటు హక్కు కల్పించి, సభ్యత్వం ఉన్న సంఘాల గుర్తింపు ర‌ద్దు చేశారని అన్నారు. నకిలీ సంఘాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శ్రుతి నడుపుతున్న సంఘంలో పోలీసు, ఐటీ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో సగం మందికి వారు సభ్యులుగా ఉన్న విషయమే తెలీదని అన్నారు.

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘంలోని ఓ పెద్ద మనిషి, శాట్‌లోని ఓ డిప్యూటీ డైరెక్టర్‌, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌ అండదండలతో శ్రుతి పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి​ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం పేరిట శ్రుతి చేస్తున్న అక్రమాలపై విజిలెన్స్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)