Breaking News

విజేత గౌతమ్‌ జూనియర్‌ కాలేజి 

Published on Wed, 03/01/2023 - 02:17

లాలాపేట: డిఫెండింగ్‌ చాంపియన్‌ గౌతమ్‌ జూనియర్‌ కాలేజి (ఈసీఐఎల్‌) జట్టు తెలంగాణ రీజియన్‌ సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకుంది. హబ్సిగూడలోని ఐఐసీటీ మైదానంలో జరిగిన జూనియర్‌ విభాగం ఫైనల్లో గౌతమ్‌ కాలేజి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కాలేజి (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజి 11 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్‌ కాలేజీ స్పిన్నర్‌ డి.మనీశ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీ మొత్తంలో మనీశ్‌ 12 వికెట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. అనంతరం గౌతమ్‌ కాలేజి జట్టు కేవలం. 4.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి గెలిచింది.

అన్విత్‌ రెడ్డి 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన అన్విత్‌ రెడ్డి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. హెచ్‌సీఏ అండర్‌–14, అండర్‌–16 లీగ్‌లలో కూడా అన్విత్‌ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. బాలాజీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’  అవార్డు లభించింది.  

సీనియర్‌ విభాగంలో భవాన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవాన్స్‌ జట్టు 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల) జట్టును ఓడించింది. ముందుగా భవాన్స్‌ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రాహుల్‌ 36 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అనంతరం వాగ్దేవి కాలేజి 14.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌ రెడ్డికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్, ఫైనల్‌’ అవార్డులు దక్కాయి.

జూనియర్, సీనియర్‌ విభాగాల్లో విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు చొప్పున... రన్నరప్‌ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది.  తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని  విన్నర్స్, రన్నరప్‌ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా  టోర్నీ లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్‌ రాణి రెడ్డి కూడా పాల్గొన్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)