Breaking News

పరాజయంతో ప్రారంభం

Published on Mon, 04/28/2025 - 03:47

జియామెన్‌ (చైనా): స్టార్‌ జోడీలు లేకుండానే ప్రతిష్టాత్మక సుదిర్మన్‌ కప్‌ ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్‌ చేతిలో ఓడిపోయింది. ఈ పరాజయంతో భారత జట్టు నాకౌట్‌ దశకు చేరుకోవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉన్నాయి. 

దాంతో భారత జట్టు విజయావకాశాలన్నీ రెండు సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడ్డాయి. అయితే ఈ రెండింటిలోనూ భారత స్టార్స్‌ ఆకట్టుకోలేకపోయారు. వెరసి ఈ టోర్నీని భారత జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల జంట 13–21, 14–21తో జెస్పెర్‌ టాఫ్ట్‌–అమెలీ మేగ్‌లండ్‌ జోడీ చేతిలో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 15–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 

మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌–రూబన్‌ కుమార్‌ ద్వయం 7–21, 4–21తో ప్రపంచ నంబర్‌వన్‌ ఆండెర్స్‌ స్కారప్‌–కిమ్‌ అస్‌ట్రుప్‌ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ పీవీ సింధు 20–22, 21–23తో లినె హోమార్క్‌ జార్స్‌ఫెల్డ్‌ చేతిలో ఓడిపోయింది. 

రెండు గేముల్లోనూ సింధు ఒకదశలో ఆధిక్యంలో ఉన్నా దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా ద్వయం 13–21, 18–21తో నటాషా–అలెగ్జాండ్రా బోయె జంటను ఓడించి భారత్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా కాపాడింది. మంగళవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ ఇండోనేసియాతో భారత్‌ ఆడుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)