Breaking News

సెమీస్‌లో భారత్‌

Published on Thu, 03/12/2026 - 02:19

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు భారత మహిళల జట్టు గెలుపు దూరంలో నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ టోర్నీలో బుధవారం జరిగిన పూల్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సలీమా టెటె బృందం 4–1 గోల్స్‌ తేడాతో వేల్స్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. మరో గోల్‌ను సాక్షి రాణా (7వ నిమిషంలో) అందించింది. వేల్స్‌ జట్టు తరఫున బెట్సాన్‌ థామస్‌ (39వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించింది. 

నవ్‌నీత్‌ కౌర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ లభించాయి. తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లలో రెండింటిని, పెనాల్టీ స్ట్రోక్‌ను నవ్‌నీత్‌ కౌర్‌ గోల్స్‌గా మలిచింది. ఈ గెలుపుతో భారత జట్టు ఏడు పాయింట్లతో పూల్‌ ‘బి’ టాపర్‌గా నిలిచింది. భారత్‌తోపాటు స్కాట్లాండ్‌ కూడా ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. 

అయితే మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా భారత్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కగా... స్కాట్లాండ్‌కు రెండో స్థానం లభించింది. స్కాట్లాండ్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 3–1తో ఉరుగ్వేపై గెలిచింది. పూల్‌ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ 2–0తో ఆస్ట్రియా జట్టుపై గెలుపొందగా... కొరియాతో మ్యాచ్‌ను ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఇంగ్లండ్‌ 9 పాయింట్లతో పూల్‌ ‘ఎ’లో టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇటలీ, కొరియా 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన గోల్స్‌ సగటుతో ఇటలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.

శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో స్కాట్లాండ్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఇటలీతో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. ఫైనల్‌ చేరుకునే రెండు జట్లకు శుక్రవారమే ప్రపంచకప్‌ బెర్త్‌లు ఖరారవుతాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య శనివారం మూడో స్థానం కోసం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్రపంచకప్‌ బెర్త్‌ లభిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)