Breaking News

‘షూటౌట్‌’లో గెలిచి సెమీస్‌లోకి భారత్‌

Published on Sat, 12/06/2025 - 02:58

చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు తమ సత్తా చాటుకుంది. అండర్‌–21 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగోసారి టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు ‘షూటౌట్‌’లో 4–3 గోల్స్‌ తేడాతో బెల్జియం జట్టును ఓడించి సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున కెప్టెన్ రోహిత్‌ (45వ నిమిషంలో), శార్దానంద్‌ తివారి (48వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

బెల్జియం జట్టుకు గాస్పర్డ్‌ కార్నెజ్‌ (11వ నిమిషంలో), నాథన్‌ రొగె (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. విజేతను నిర్ణయించే ‘షూటౌట్‌’లో భారత గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెల్జియం జట్టుకు చెందిన రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను నిలువరించి భారత్‌ను గెలిపించాడు. ‘షూటౌట్‌’లో భారత్‌ తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్‌లను శార్దానంద్‌ తివారినే తీసుకొని మూడింటిని గోల్స్‌గా మలిచాడు. మరోవైపు బెల్జియం తరఫున తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్‌లను హుగో లబుచెరి, గుర్లెయిన్, చార్లెస్‌ గోల్స్‌గా మలిచారు. 

భారత్‌ తరఫున నాలుగో పెనాల్టీ స్ట్రోక్‌లో మన్‌మీత్‌ సింగ్‌... బెల్జియం తరఫున నాథన్‌ రొగె విఫలమయ్యారు. భారత్‌ తరఫున ఐదో పెనాల్టీ స్ట్రోక్‌ను అంకిత్‌ పాల్‌ లక్ష్యానికి చేర్చగా... బెల్జియం ప్లేయర్‌ నికోలస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను భారత గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఆదివారం జరిగే సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీతో భారత్‌; అర్జెంటీనాతో స్పెయిన్‌ తలపడతాయి. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)