Breaking News

ఉప్పల్‌ పిచ్‌ ఆటకు అనుకూలమే.. ఓటములకు నిరాశ పడొద్దు

Published on Sat, 04/12/2025 - 12:15

శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో పిచ్‌ ఆటకు అనుకూలంగానే ఉంటుందని ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని టీబీసీ సెలూన్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రికెట్, ఇతర ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. రేపటి ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ఓడిపోతున్నామని నిరాశ పడవద్దని, ఇప్పటి వరకూ ఆడిన ఆటతీరుతో ఎస్‌ఆర్‌హెచ్‌తో ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. రెండు రోజుల గ్యాప్‌ ఉందని తనను ఇక్కడికి ఇన్‌వైట్‌ చేశారని, తాను ప్రారంభించిన స్టోర్‌లో తన అభిమానులు విజిట్‌ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనను అభిమానిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు కతజ్ఞతలు తెలిపారు.  

ఇక్కడి బిర్యానీ టేస్ట్‌ చేశా.. 
తాను క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతానో.. నగరంలోని బిర్యానీని అంతగా ఇష్టపడతానని, అందుకే హైదరాబాద్‌ బిర్యానీని టేస్ట్‌ చేశానని నితీష్‌ తెలిపారు. దీంతో పాటు నగరంలోని క్రికెట్‌ పిచ్‌ కూడా అంతే ఇష్టమని స్పష్టం చేశారు.  

ఎస్‌ఆర్‌హెచ్‌ క్రికెటర్ల సందడి.. 
నల్లగండ్ల టీబీసీ సెలూన్‌ ప్రారంభానికి నితీష్‌ కుమార్‌రెడ్డితోపాటు ఎస్‌ఆర్‌హెచ్‌ క్రికెటర్లు మ్కాస్‌ స్టోయినిస్, ఇషాన్‌కిషన్, అభిõÙక్‌ శర్మ, జావియర్‌ బార్లెట్, అరోన్‌ హర్డీ వంటి క్రికెటర్లు కూడా హాజరై సందడి చేశారు. క్రికెటర్లను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)