Breaking News

బంగ్లా బౌల‌ర్ సూపర్ డెలివ‌రీ.. కివీస్ ఓపెన‌ర్‌కు ఫ్యూజ్‌లు ఔట్

Published on Mon, 02/24/2025 - 20:40

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో రావ‌ల్పిండి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 237 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకునేందుకు బంగ్లా బౌల‌ర్లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో బంగ్లా స్పీడ్ స్టార్ టాస్కిన్ అహ్మ‌ద్‌ తొలి ఓవ‌ర్‌లోనే త‌న జ‌ట్టుకు ఘన‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు. టాస్కిన్ సంచ‌లన‌ బంతితో న్యూజిలాండ్ ఓపెన‌ర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ వేసిన టాస్కిన్‌.. ఆఖ‌రి బంతిని యంగ్‌కు అద్బుత‌మైన లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ డెలివ‌రీని యంగ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి బ్యాట్‌-ప్యాడ్ గ్యాప్ మ‌ధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో యంగ్ ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయాడు.

టాస్కిన్ దెబ్బ‌కు కివీ ఓపెన‌ర్ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఆ త‌ర్వాత ఓవ‌ర్‌లోనే కేన్ విలియ‌మ్స‌న్‌(5) సైతం ఔట‌య్యాడు. అయితే రచిన్ ర‌వీంద్ర‌(59) నిల‌క‌డ‌గా ఆడుతుండ‌డంతో కివీస్ 25 ఓవ‌ర్ల‌కు ముగిసేస‌రికి 111 ప‌రుగులు చేసింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.

కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్‌ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు.

 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)