Breaking News

తాన్యా హేమంత్‌కు సింగిల్స్‌ టైటిల్‌

Published on Sun, 08/17/2025 - 03:59

న్యూఢిల్లీ: సైపాన్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ తాన్యా హేమంత్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 86వ ర్యాంకర్‌ తాన్యా 15–10, 15–8తో కానాయ్‌ సకాయ్‌ (జపాన్‌)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన తాన్యా తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో గెలుపొందింది. 21 ఏళ్ల తాన్యాకు ఇది నాలుగో అంతర్జాతీయ టైటిల్‌.

అంతకుముందు ఇండియా ఇంటర్నేషనల్‌ (2022), ఇరాన్‌ ఫజ్ర్‌ ఇంటర్నేషనల్‌ (2023), బెండిగో ఇంటర్నేషనల్‌ (2024)లో తాన్యా టైటిల్స్‌ గెలుచుకుంది. గతేడాది అజర్‌బైజాన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత షట్లర్‌ మాళవిక బన్సోద్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 

తాజా టోర్నీలో తాన్యా... సెమీఫైనల్లో రిరినా హిరామొటో (జపాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో లీ జిన్‌ యీ మెగన్‌ (సింగపూర్‌)పై, ప్రిక్వార్టర్స్‌లో నొడొకా సునకవా (జపాన్‌)పై విజయాలు సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ట్రయల్స్‌లో భాగంగా... ఈ టోర్నమెంట్‌లో ఒక్కో గేమ్‌లో 21 పాయింట్లకు బదులు 15 పాయింట్లుగా నిర్వహించారు.  
 

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)