Breaking News

అశ్విన్ వారసుడు దొరికిన‌ట్లేనా?

Published on Sat, 10/05/2024 - 17:33

భార‌త క్రికెట్‌కు మ‌రో అస‌లుసిస‌లైన ఆల్‌రౌండ‌ర్ దొరికేశాడు.  బ్యాట్‌తో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసే స‌త్తా అత‌డిది. మ‌రోవైపు బంతితో బ్యాట‌ర్ల‌కు ముప్పు తిప్ప‌లు పెట్టే మాస్ట‌ర్ మైండ్ అత‌డిది. జ‌ట్టులో క‌ష్టాల్లో ఉందంటే అంద‌రికి గుర్తు వ‌చ్చే ఆపద్బాంధవుడు. అత‌డే ముంబై యువ సంచ‌ల‌నం తనీష్  కోటియన్‌. 

కోటియన్‌ గ‌త కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదిక‌గా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జ‌రిగిన ఇరానీ క‌ప్‌ను ముంబై సొంతం చేసుకోవ‌డం లోనూ తనీష్ కీల‌క పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన కోటియన్.. రెండో ఇన్నింగ్స్‌లో సంచ‌ల‌న సెంచ‌రీతో చెల‌రేగాడు.  ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి మ‌రి కోటియ‌న్‌ సెంచరీ చేయ‌డం గ‌మానార్హం. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ 3 వికెట్ల‌తో స‌త్తాచాటాడు.

అశ్విన్ వారుసుడు దొరికిన‌ట్లేనా?
ఫ‌స్ట్‌ క్రికెట్‌లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న చూసిన క్రికెట్ నిపుణులు త్వ‌ర‌లోనే భార‌త టెస్టు జ‌ట్టులోకి ఎంట్రీ ఇస్తాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి కొంత‌మంది ఒక అడుగు ముందుకు వేసి ఈ యువ సంచ‌ల‌నం.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ వారుసుడుగా బాధ్య‌త‌లు చేప‌డ‌తాడ‌ని జోస్యం చెబుతున్నారు.

కాగా అశ్విన్‌కు, త‌నీష్‌కు ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి. ఇద్ద‌రూ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్  బౌలింగ్ చేస్తారు. అంతేకాకుండా బ్యాటింగ్ పొజిషేన్ కూడా దాదాపు స‌మానంగా ఉంది. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు అశ్విన్ ఏ విధంగా అయితే ఆదుకుంటాడో, కోటియన్ కూడా విరోచిత పోరాటం క‌న‌బ‌రుస్తున్నాడు. అశ్విన్ రిటైర‌య్యాక భార‌త టెస్టు జ‌ట్టులో కీల‌క ఆల్‌రౌండ‌ర్‌గా తనీష్ మారే అవ‌కాశ‌ముంది.

ఎవ‌రీ త‌నీష్‌.. ?
25 ఏళ్ల త‌నీష్ కోటియన్‌ ముంబైలో జ‌న్మించాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ముంబైకు తనీష్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. 2018 రంజీ సీజ‌న్‌తో సౌరాష్ట్ర‌పై కోటియ‌న్ ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్ప‌టివ‌ర‌కు 30 రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అత‌డు 88 వికెట్ల‌తో పాటు 1451 ప‌రుగులు చేశాడు. 

ముఖ్యంగా ఈ ఏడాది రంజీ సీజన్‌లో కోటియ‌న్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన కోటియ‌న్‌.. 502 ప‌రుగుల‌తో పాటు 29 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో కూడా త‌నీష్ 121 ప‌రుగుల‌తో పాటు 10 వికెట్లు సాధించాడు.
చదవండి: 
 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)