దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌

Published on Fri, 07/07/2023 - 19:50

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చి అందరికి షాక్‌ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్‌ ఇక్బాల్‌. కాగా అతను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం.

ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తమీమ్‌ ఇక్బాల్‌ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్‌ ఇక్బాల్‌ మీడియాకు వివరించాడు.

మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్‌ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్‌ వరకైనా క్రికెట్‌ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్‌ ఇక్బాల్‌ పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్‌ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా  మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు.

ఇక తమీమ్‌ ఇక్బాల్‌ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ  ఇచ్చాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన తమీమ్‌.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో తమీమ్‌ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. 

చదవండి: Tamim Iqbal Retirement: స్టార్‌ క్రికెటర్‌ షాకింగ్‌ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్‌ ప్రకటన

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)