Breaking News

చాంపియన్‌ ప్రజ్ఞానంద

Published on Sat, 06/28/2025 - 03:17

తాష్కెంట్‌: అందివచ్చిచన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద... ఉజ్‌చెస్‌ కప్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానందతోపాటు నొదిర్‌బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), జవోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) 5.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఈ ముగ్గురి మధ్య టైబ్రేక్‌ గేమ్‌లను నిర్వహించారు.  

తొలి రౌండ్‌ టైబ్రేక్‌ గేమ్‌ల తర్వాత ముగ్గురూ 2 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో ఈ ముగ్గురి మధ్య రెండో రౌండ్‌ టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. ఈసారి ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. 1 పాయింట్‌తో సిందరోవ్‌ రన్నరప్‌గా నిలిచాడు. అర పాయింట్‌తో నొదిర్‌బెక్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గురువారం ఎనిమిదో రౌండ్‌ ముగిశాక నొదిర్‌బెక్‌ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో, సిందరోవ్‌ 5 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 

శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో నొదిర్‌బెక్‌ను ఓడించగా... పర్హామ్‌ మగ్సూద్‌ (ఇరాన్‌)తో జరిగిన గేమ్‌ను సిందరోవ్‌ ‘డ్రా’ చేసుకున్నాడు. దాంతో ఈ ముగ్గురూ 5.5 పాయింట్లతో ఉమ్మడిగా టాప్‌ ర్యాంక్‌లో నిలిచారు. తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఐదు పాయింట్లతో నాలుగో స్థానంతో ఈ టోర్నీని ముగించాడు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

తాజా విజయంతో 19 ఏళ్ల ప్రజ్ఞానంద లైవ్‌ రేటింగ్స్‌లో 2778.3 పాయింట్లతో భారత నంబర్‌వన్‌ చెస్‌ ప్లేయర్‌గా అవతరించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈ తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ నాలుగో స్థానానికి ఎగబాకాడు. 2776.6 పాయింట్లతో దొమ్మరాజు గుకేశ్‌ ఐదో స్థానంలో, 2775.7 పాయింట్లతో అర్జున్‌ ఆరో స్థానంలో ఉన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)