T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్‌

Published on Thu, 06/06/2024 - 10:53

43 ఏళ్ల ఉగాండ బౌలర్‌ ఫ్రాంక్‌ న్సుబుగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో (1.00) పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో ఇవాళ (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో ఫ్రాంక్‌.. 4 ఓవర్ల స్పెల్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్‌లో ఏకంగా 2 మెయిడిన్‌ ఓవర్లు ఉండటం మరో విశేషం.

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల చరిత్రలో అతి తక్కువ ఎకానమీతో 4 ఓవర్ల స్పెల్‌ పూర్తి చేసిన బౌలర్ల వివరాలు..

ఫ్రాంక్‌ న్సుబుగా (ఉగాండ)-  1.00
అన్రిచ్‌ నోర్జే (సౌతాఫ్రికా)- 1.75
అజంత మెండిస్‌ (శ్రీలంక)- 2.00
మహ్మదుల్లా (బంగ్లాదేశ్‌)- 2.00
హసరంగ (శ్రీలంక)- 2.00

కాగా, గయానా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్‌జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్‌జీ బ్యాటింగ్‌ లైనప్‌ను మడత పెట్టారు.

ఫ్రాంక్‌ న్సుబుగా (4-2-4-2), అల్పేశ్‌ రాంజానీ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్‌ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్‌ మసాబా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పీఎన్‌జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే రియాజత్‌ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి ఉగాండను గెలిపించారు. 

వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పీఎన్‌జీ బౌలర్లలో అలెయ్‌ నావ్‌ (4-0-16-2), నార్మన్‌ వనువా (4-0-19-2), చాడ్‌ సోపర్‌ (4-0-13-1), అస్సద్‌ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు.

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)