Breaking News

AUS Vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..

Published on Sun, 06/09/2024 - 07:28

టీ20 వరల్డ్‌కప్‌-2024లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆసీస్‌ టాపార్డర్ బ్యాటర్లు అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు.

ట్రావిస్‌ హెడ్‌(34), వార్నర్‌(39), మిచెల్‌ మార్ష్‌(35), మాక్స్‌వెల్‌(28), స్టోయినిష్‌(30) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మొయిన్‌ అలీ,అర్చర్‌, లివింగ్‌ స్టోన్‌, రషీద్ తలా వికెట్‌ సాధించారు.

రాణించిన ఆసీస్‌ బౌలర్లు..
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(42) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌ సాల్ట్‌(37), మొయిన్‌ అలీ(25) తమ వంతు ప్రయత్నం చేశారు. 

ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమ్మిన్స్‌, జంపా తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్‌వుడ్‌, మార్కస్‌ స్టోయినిష్‌ తలా వికెట్‌ పడగొట్టారు. కాగా ఆసీస్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)