Breaking News

శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్‌.. 2 వికెట్ల తేడాతో విజయం

Published on Sat, 06/08/2024 - 10:17

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ను బంగ్లాదేశ్ విజ‌యంతో ఆరంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. శ్రీలంక ఆఖ‌రి వ‌ర‌కు పోరాడ‌నప్ప‌టికి విజ‌యం మాత్రం బంగ్లానే వ‌రించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 124 ప‌రుగుల నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. 

లంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ నిస్సాంక‌(47) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ధ‌నుంజ‌య డి సిల్వా(21), అస‌లంక‌(19) ప‌రుగుల‌తో రాణించారు. బంగ్లా బౌల‌ర్ల‌లో రిష‌ద్ హోస్సేన్‌, ముస్తఫిజుర్ రెహ్మాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. టాస్కిన్ అహ్మ‌ద్ రెండు, టాంజిమ్ హ‌స‌న్ ష‌కీబ్ ఒక్క వికెట్ సాధించారు. 

అనంత‌రం 125 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. 19 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో తౌహిద్ హృదయ్‌(40), లిటన్‌ దాస్‌(36) పరుగులతో టాప్‌ స్కోరర్లగా నిలవగా.. ఆఖరిలో మహ్మదుల్లా(16) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లంక బౌలర్లలో నువాన్‌ తుషారా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగా రెండు, పతిరాన ఒక్క వికెట్‌ సాధించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)