సామ్‌ కర్రన్‌ వీర బాదుడు

Published on Wed, 09/04/2024 - 14:46

టీ20 బ్లాస్ట్‌ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (సెప్టెంబర్‌ 3) జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్‌ సిబ్లే (67), సామ్‌ కర్రన్‌ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్‌ కర్రన్‌ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్‌ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్‌ రెయినే (23), మైఖేల్‌ జోన్స్‌ (37 నాటౌట్‌), టర్నర్‌ (27), బాస్‌ డి లీడ్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్‌ వారెల్‌, రీస్‌ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్‌ కర్రన్‌, సామ్‌ కర్రన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్‌ సిబ్లే, సామ్‌ కర్రన్‌ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

విల్‌ జాక్స్‌ 8, లారీ ఈవాన్స్‌ 1, రోరి బర్న్స్‌ 10 పరుగులు చేశారు. డర్హమ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌, పార్కిన్సన్‌ తలో రెండు వికెట్లు, బెన్‌ రెయినే ఓ వికెట్‌ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్‌ రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఇవాళ ససెక్స్‌, లాంకాషైర్‌ జట్లు తలపడనున్నాయి. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)