బ్యాట్‌తో రాణించిన షమీ.. క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌

Published on Mon, 12/09/2024 - 15:29

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో బెంగాల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్‌ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌-1లో బెంగాల్‌ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్‌ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్‌ లాల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ప్రదిప్త ప్రమాణిక్‌ 30, వ్రిత్తిక్‌ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్‌ బౌలర్లలో జగ్జీత్‌ సింగ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్‌ బవా 2, నిఖిల్‌ శర్మ, అమృత్‌ లుబానా, భగ్మేందర్‌ లాథర్‌ తలో వికెట్‌ తీశారు.

160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్‌ ఘోష్‌ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్‌ను దెబ్బకొట్టాడు. 

కనిష్క్‌ సేథ్‌ 2, షాబాజ్‌ అహ్మద్‌, షమీ తలో వికెట్‌ పడగొట్టారు. చండీఘడ్‌ ఇన్నింగ్స్‌లో రాజ్‌ బవా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్‌ యాదవ్‌ (27), మనన్‌ వోహ్రా (23), నిఖిల్‌ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

కాగా, డిసెంబర్‌ 11న జరిగే క్వార్టర్‌ ఫైనల్‌-1లో బెంగాల్‌ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది.  
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)