Breaking News

3 వికెట్లు పడగొట్టిన అర్జున్‌ టెండూల్కర్‌.. పోరాడి ఓడిన ఆంధ్ర

Published on Mon, 10/16/2023 - 20:33

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2023లో గోవా తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ గ్రూపు-సిలో భాగంగా రాంఛీ వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గోవా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

గోవా బ్యాటర్లలో కెప్టెన్‌ దర్శన్ మిసల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దర్శన్‌ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు రాహుల్‌ త్రిపాఠి(47), తునీష్ సాకర్(11 బంతుల్లో 34) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. మోహన్‌, హనుమా విహారి చెరో వికెట్‌ పడగొట్టారు.

పోరాడి ఓడిన ఆంధ్ర.. 
ఇక 232 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 18.3 ఓవర్లలో 201 పరుగులకు ఆంధ్ర ఆలౌటైంది. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఆంధ్ర జట్టు ఓటమి పాలైంది. ఆంధ్ర బ్యాటర్లలో హనుమ విహారి(58) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ శ్రీకర్‌ భరత్‌(31), అశ్విన్‌ హెబ్బర్‌(31) పరుగులు చేశారు. గోవా బౌలర్లలో అర్జున్‌ టెండూల్కర్‌, లక్షయ్‌ గార్గ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. తారి,  దర్శన్ మిసల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: AUS vs SL: డేవిడ్‌ వార్నర్‌ మంచి మనసు.. వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)