Breaking News

ప్రపంచ రికార్డు... పసిడి పతకం

Published on Sat, 08/10/2024 - 04:16

పారిస్‌: ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టి 40 ఏళ్లయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏ అథ్లెట్‌ వరుసగా రెండు స్వర్ణాలు సాధించలేదు. కానీ ‘పారిస్‌’లో అమెరికా క్రీడాకారిణి సిడ్నీ మెక్లాఫ్లిన్‌ లెవ్రోన్‌ ఈ ఘనత సాధించింది. 

టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన సిడ్నీ మెక్లాఫ్లిన్‌ అదే ఫలితాన్ని పారిస్‌లో పునరావృతం చేసింది. ఈసారి ఏకంగా కొత్త ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులను కూడా సృష్టించింది. శుక్రవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 25 ఏళ్ల సిడ్నీ 50.37 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులను నెలకొల్పింది. 

ఈ ఏడాది జూన్‌ 30న 50.65 సెకన్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సిడ్నీ తిరగరాసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సిడ్నీ 51.46 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం నెగ్గింది. ఈ సమయాన్ని కూడా ఆమె ‘పారిస్‌’లో అధిగమించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ విభాగంలో సిడ్నీ మెక్లాఫ్లిన్‌ ఐదుసార్లు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)