Breaking News

సూర్య‌కుమార్ వ‌ర‌ల్డ్ రికార్డు.. సౌతాఫ్రికా కెప్టెన్‌ను దాటేశాడు

Published on Tue, 05/27/2025 - 13:37

ఐపీఎల్‌-2025లో టీమిండియా టీ20 కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ దుమ్ములేపుతున్నాడు. సోమ‌వారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌కుమార్ అద్భుత‌మైన హాఫ్ సెంచరీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న సూర్య‌కుమార్‌.. 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 57 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో సూర్య భాయ్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో వరుసగా అత్య‌ధిక సార్లు 25 ప‌రుగులు దాటిన క్రికెట‌ర్‌గా సూర్య చ‌రిత్ర‌పుట‌లెక్కాడు. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో ఈ ముంబైక‌ర్ వ‌రుస‌గా 14 సార్లు 25 పైగా ప‌రుగులు చేశాడు. దీంతో ఈ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పేరిట ఉండేది. 

బావుమా వ‌రుస‌గా 13 టీ20 మ్యాచ్‌ల‌లో 25 ప్ల‌స్ ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ కెప్టెన్‌ను సూర్య అధిగ‌మించాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 14 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌కుమార్ 640 ప‌రుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్దానంలో కొన‌సాగుతున్నాడు. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ముంబై ఇండియ‌న్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పంజాబ్ టాప్ స్దానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

సూర్యకుమార్‌ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్ష్‌దీప్‌, యాన్సెన్, వైశాక్‌ తలా 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలుపొందింది.
చదవండి: గిల్‌ను కాదు అత‌డిని కెప్టెన్‌గా సెల‌క్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్‌
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)