Breaking News

సూర్య చరిష్మా సంచలనం

Published on Sat, 12/27/2025 - 02:26

సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి తమరి సూర్య చరిష్మా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సూర్య చరిష్మా 21–12, 21–15తో టాప్‌ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్‌ ఉన్నతి హుడా (హరియాణా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తొలి గేమ్‌లో ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 

రెండో గేమ్‌లో స్కోరు 10–8 వద్ద సూర్య చరిష్మా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15–8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఆంధ్ర షట్లర్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్‌ చేరే క్రమంలో సూర్య చరిష్మా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో రక్షిత శ్రీ (తమిళనాడు)తో ఆమె ఆడుతుంది.

ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో రక్షిత శ్రీ 16–21, 21–14, 21–18తో తన్వీ శర్మ (పంజాబ్‌)పై, తన్వీ పత్రి (ఒడిశా) 21–16, 12–21, 22–20తో ఆకర్షి కశ్యప్‌ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)పై, శ్రుతి ముందాడ (మహారాష్ట్ర) 22–20, 21–12తో రెండో సీడ్‌ అనుపమ (ఢిల్లీ)పై గెలిచారు.  

తరుణ్‌ జోరు 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్‌ తరుణ్‌ మన్నేపల్లి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మన్‌రాజ్‌ సింగ్‌ (హరియాణా)తో 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్‌ తరుణ్‌ 21–13, 22–20తో గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో భరత్‌ రాఘవ్‌ (హరియాణా)తో తరుణ్‌ ఆడతాడు. 

ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ కిరణ్‌ జార్జి (కేరళ) 21–18, 21–18తో రౌనక్‌ చౌహాన్‌ (ఛత్తీస్‌గఢ్‌)పై, రితి్వక్‌ సంజీవి (తమిళనాడు) 21–13, 22–20తో సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ (తమిళనాడు)పై, భరత్‌ రాఘవ్‌ 21–17, 21–13తో జిన్‌పాల్‌ సోనా (ఢిల్లీ)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో కలగోట్ల వెన్నెల (తెలంగాణ)–రేíÙక (తమిళనాడు) జోడీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాతి్వక్‌ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్‌) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.    

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)