Breaking News

సురేష్‌ రైనా విధ్వంసం.. కేవలం 33 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Published on Sun, 03/03/2024 - 08:15

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌లో భారత మాజీ ఆటగాడు సురేష్‌ రైనా తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐవీపీఎల్‌-2024లో వీవీఐపీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌కు సారథ్యం వహిస్తున్న రైనా.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాలను అందిస్తు​న్నాడు. ఈ లీగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఫైనల్‌కు చేరడంలో రైనా కీలక పాత్ర పోషించాడు.

ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌తో జరిగిన సెకెండ్‌ సెమీఫైనల్లో కూడా రైనా సత్తాచాటాడు. సెమీఫైనల్లో 19 పరుగుల తేడాతో ఛత్తీస్‌గడ్‌ను చిత్తు చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన వీవీఐపీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

యూపీ బ్యాటర్లలో  పవన్‌ నేగి మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు. అదేవిధంగా కెప్టెన్‌ రైనా కూడా ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 'మిస్టర్‌ ఐపీఎల్‌' 58 పరుగులు చేశాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో షాదాబ్‌ జాక్తీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్ ఓపెనర్లు జటిన్‌ సక్సేనా(76), నమాన్‌ ఓజా(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
చదవండి: AUS vs NZ: తిరుగులేని ఆసీస్‌.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)