Breaking News

యూరప్‌లో చెఫ్‌ అవతారమెత్తిన రైనా.. నోరూరించే రుచులతో..

Published on Fri, 06/23/2023 - 19:24

Suresh Raina Restaurant: టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఫుడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ ఆరంభించాడు. యూరప్‌ నడిబొడ్డున భారత రుచులను కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధమైపోయాడు.

రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా చెఫ్‌ అవతారమెత్తాడు ఈ మిస్టర్‌ ఐపీఎల్‌. ‘రైనా’ పేరిట మొదలెట్టిన రెస్టారెంట్‌ ముందు నిలబడి తమ ఉద్యోగులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

సరికొత్త రుచులు
‘‘ఇంతకు ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో మేము సిద్ధం. రుచి చూసేందుకు మీరూ సిద్ధంకండి. ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్‌ రెస్టారెంట్‌ మొదలెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుడ్‌ పట్ల నాకున్న ప్యాషన్‌ ఇక్కడ మీరు చూడబోతున్నారు’’ అని సురేశ్‌ రైనా తన పోస్టులో చెప్పుకొచ్చాడు. 

నోరూరించే వెరైటీలు
తమ రెస్టారెంట్‌లో ఉత్తర భారత వంటల సువాసనలతో పాటు.. దక్షిణ భారత అదిరిపోయే రుచులను కూడా అందిస్తామని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా రైనా రెస్టారెంట్‌లో చికెన్‌ చాట్‌, మిక్స్‌ పకోడా, జైతుని పనీర్‌ టిక్కా, తందూర్‌ చికెన్‌ టిక్కా, ఆనియన్‌ భాజీతో పాటు పలురకాల కెబాబ్స్‌ స్టార్టర్లుగా వడ్డించనున్నారు. 

అదే విధంగా ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ప్రసిద్ధి పొందిన దహీ భల్లా, పానీ పూరీ, చాట్‌ పాప్రీ, ఆలూ చాట్‌, సమోసా కూడా వీరి మెనూలో ఉన్నాయి. చికెన్‌, మటన్‌, ఫిష్‌ సహా వెజ్‌టేరియన్‌ వెరైటీలతో కస్టమర్లను ఆకర్షించేందుకు రైనా రెస్టారెంట్‌ సిద్ధమైపోయింది.  

భార్య బ్యాంకర్‌గా
కాగా సురేశ్‌ రైనా భార్య ప్రియాంక గతంలో నెదర్లాండ్స్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా తరచుగా ఆమ్‌స్టర్‌డామ్‌ వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడే రెస్టారెంట్‌ ఆరంభించి తన కలను నిజం చేసుకున్నాడు. ఇక తాను ఫుడీనంటూ గతంలో రైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చిన్న తలా కెరీర్‌ ఇలా
ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1604 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. చిన్న తలాగా పేరొందాడు. మహేంద్ర సింగ్‌ ధోనికి అత్యంత సన్నిహితుడైన రైనా.. మిస్టర్‌ కూల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే తానూ గుడ్‌ చెప్పాడు. 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్‌ విజేత, 2 సార్లు ఐపీఎల్‌ ‘విన్నర్‌’.. ఇప్పుడు పోలీస్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)