Breaking News

సన్‌రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్‌గా

Published on Sun, 02/11/2024 - 08:00

సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ పోరులో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్‌.. వరుసగా రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో స్టబ్స్‌(56), అబెల్‌(55) హాఫ్‌ సెంచరీలతో చెలరేగగా.. హెర్మెన్‌(42), మార్‌క్రమ్‌(42) పరుగులతో రాణించారు. డర్బన్‌ బౌలర్లలో కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, టాప్లీ ఒక్క వికెట్‌ సాధించారు. అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌ జెయింట్స్‌ 115 పరుగులకే కుప్పకూలింది.

సన్‌రైజర్స్‌ పేసర్‌ మార్కో జానెసన్‌ 5 వికెట్లతో సూపర్‌ జెయింట్స్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు బార్ట్‌మన్‌, వారెల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. డర్బన్‌ బ్యాటర్లలో ముల్డర్‌(38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ కీలక పోరులో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన అబెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. అదేవిధంగా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన హెన్రిస్‌ క్లాసెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. కాగా గతేడాది జరిగిన తొట్టతొలి  సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సొంతం చేసుకుంది.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)