Breaking News

రాయల్స్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్‌​

Published on Fri, 02/07/2025 - 08:00

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025 ఫైనల్లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌(Sunrisers Eastern Cape) అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్‌ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో పార్ల్‌ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్‌.. వరుసగా మూడో సారి తమ ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పార్ల్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

పార్ల్‌ బ్యాటర్లలో రూబిన్ హెర్మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెర్మాన్‌​.. 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్‌ లువాన్-డ్రే ప్రిటోరియస్(59) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఓవర్టన్‌, మార్కో జానెసన్‌, బార్టమన్‌, మార్‌క్రమ్‌ తలా వికెట్‌ సాధించారు.

టోనీ ఊచకోత..
అనంతరం 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఈస్ట్రన్‌ కేప్‌ ఓపెనర్‌ టోనీ డి జోర్జి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయల్స్‌ బౌలర్లను టోనీ ఊచకోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.

అతడితో పాటు జోర్డాన్‌ హెర్మాన్‌ సైతం కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాయల్స్‌ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలా వికెట్‌ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

ఎంఐ కేప్‌టౌన్‌తో ఢీ..
ఇక శనివారం(ఫిబ్రవరి 8)న జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కేప్‌టౌన్‌కు ఇదే తొలి ఫైనల్‌ కాగా.. సన్‌రైజర్స్‌కు మాత్రం ఇది ముచ్చటగా మూడో ఫైనల్‌. తొలి రెండు సీజన్లలోనూ మార్‌క్రమ్‌ సారథ్యంలోనే సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది. కాగా ఈస్ట్రన్‌ కేప్‌ జట్టు ఐపీఎల్‌ ప్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యానికే సంబంధించినదే కావడం గమనార్హం. 
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్‌ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)