Breaking News

సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన స‌న్‌రైజ‌ర్స్‌.. జట్టు నుంచి ఔట్‌

Published on Thu, 08/01/2024 - 13:55

సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజ‌న్ కోసం రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్ర‌క‌టించింది. కెప్టెన్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌తో పాటు 12 మంది స‌భ్యుల‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.

అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్ల‌ను స‌న్‌రైజ‌ర్స్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు  డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్,  అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.

మ‌రోవైపు వ‌చ్చే ఏడాది సీజ‌న్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)ల‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త‌గా ఒప్పందం కుద‌ర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆట‌గాడు డేవిడ్ బెడింగ్‌హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.

 కాగా ద‌క్షిణాఫ్రికా లీగ్ మూడో సీజ‌న్ వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 9 నుంచి ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇక తొలి రెండు సీజ‌న్ల‌లోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జ‌ట్టునే ఛాంపియ‌న్స్‌గా నిలిచింది.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే
ఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)