Breaking News

పోరాడి ఓడిన సుమిత్‌  

Published on Fri, 04/12/2024 - 04:32

మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హోల్గర్‌ రూనే (డెన్మార్క్‌)తో  జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 93వ ర్యాంకర్‌ సుమిత్‌ ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు.

సుమిత్‌కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  ఈ ప్రదర్శనతో సుమిత్‌ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 80వ ర్యాంక్‌ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్‌గా సుమిత్‌ గుర్తింపు పొందుతాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)