Breaking News

సుమిత్‌ నగాల్‌ శుభారంభం

Published on Wed, 05/21/2025 - 03:35

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ శుభారంభం చేశాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 170వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–1, 6–1తో ప్రపంచ 141వ ర్యాంకర్‌ మిచెల్‌ క్రుగెర్‌ (అమెరికా)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ ఒక ఏస్‌ సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని సుమిత్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. 

సుమిత్‌ నెగ్గిన మొత్తం 59 పాయింట్లలో 22 విన్నర్స్‌ ఉన్నాయి. 14 అనవసర తప్పిదాలు చేసిన సుమిత్‌ నెట్‌ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 225వ ర్యాంకర్‌ జురిజ్‌ రొడియోనోవ్‌ (ఆ్రస్టియా)తో సుమిత్‌ తలపడతాడు. 27 ఏళ్ల సుమిత్‌ తన కెరీర్‌లో ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. 

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో మూడుసార్లు, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌లో ఒక్కోసారి, యూఎస్‌ ఓపెన్‌లో మూడుసార్లు అతను మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 2020 యూఎస్‌ ఓపెన్‌లో, 2024 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరడం సుమిత్‌ గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.   

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)