Breaking News

పతకాల పంట

Published on Thu, 10/26/2023 - 01:03

హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్‌ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌64 కేటగిరీలో సుమిత్‌ అంటిల్‌ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్‌ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

జావెలిన్‌ త్రో ఎఫ్‌46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్‌ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్‌ దినేశ్‌ ముదియన్‌సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్‌ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్‌37/38 జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో హనే... మహిళల టి47 లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. 

కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని 
పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో  నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి