ఆర్చర్‌ను పక్కన పెట్టండి.. అతడిని జట్టులోకి తీసుకోండి: బ్రాడ్‌

Published on Tue, 07/29/2025 - 13:07

అండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టు గెలిచి సిరీస్‌ను 3-1 సొంతం చేసుకోవాల‌ని భావించిన ఇంగ్లండ్ జ‌ట్టుకు టీమిండియా ఝుల‌క్ ఇచ్చింది. 

ఆ మ్యాచ్‌ను భార‌త జ‌ట్టు త‌మ విరోచిత పోరాటంతో డ్రా ముగించింది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆఖ‌రి టెస్టు జూలై 31 నుంచి లండ‌న్‌లోని ఓవెల్ మైదానం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌కు ఆ దేశ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక సూచన చేశాడు. ఓవెల్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌కు బదులుగా గాస్ అట్కినసన్‌ను ఆడించాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.

"ఐదో టెస్టుకు జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతి ఇవ్వాలి. అతడి స్ధానంలో గస్ అట్కిన్సన్ ఆడించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడిపై పస్తుతం ఎటువంటి వర్క్‌లోడ్ లేదు. ఆఖరి టెస్టులో అతడిని ఖచ్చితంగా ఆడించాలి. అట్కిన్సన్ టెస్టు క్రికెట్‌లో  ఇప్పటివరకు సరైన ప్రత్యర్ధిని ఎదుర్కొలేదు.

 అదేవిధంగా బ్రైడన్ కార్స్ కూడా బాగా ఆలిసిపోయాడు. నాలుగో టెస్టులో అతడు అంత కంఫర్ట్‌గా కన్పించలేదు. కానీ ఈ సిరీస్‌లో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కార్స్‌కు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో టీమ్‌మెనెజ్‌మెంట్ ఉండొచ్చు. 

ఒకవేళ అదే జరిగితే అట్కినసన్ జట్టులోకి రావడం ఖాయం. జోష్ టంగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. టంగ్ భారత లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. కాబట్టి ఆర్చర్‌కు ప్రత్యామ్నాయంగా టంగ్‌ను కూడా జట్టులోకి తీసుకొవచ్చు" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ పేర్కొన్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)