Breaking News

చ‌రిత్ర సృష్టించిన స్మిత్‌, ఖావాజా.. తొలి ఆసీస్ జోడీగా

Published on Thu, 01/30/2025 - 13:22

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో  లంక బౌలర్ల భరతం పట్టిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో రోజు ఆటలో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా కంగారూ జట్టు సాగుతోంది.  117 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 486 ప‌రుగులు చేసింది. 

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ఉస్మాన్ ఖావాజా డ‌బుల్ సెంచ‌రీతో మెరిశాడు. . 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఖావాజా తన తొలి డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మ‌రోవైపు ఆసీస్ సూప‌ర్ స్టార్ స్మివ్ స్మిత్ కూడా సూప‌ర్ సెంచ‌రీతో సత్తాచాటాడు. 251 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్మిత్‌ 141 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో స్పిన్నర్‌ వాండర్సే బౌలింగ్‌లో ఎల్బీగా స్మిత్‌ వెనుదిరిగాడు.

అరుదైన రికార్డు..
కాగా మూడో వికెట్‌కు ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మిత్‌​ మూడో వికెట్‌కు 266 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని వీరిద్దరూ నెలకొల్పారు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఈ వెటరన్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్ట్రేలియన్ జోడీగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. 

ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, డామియన్ మార్టిన్ పేరిట ఉండేది. 2004లో కాండే వేదికగా జరిగిన లంకతో జరిగిన టెస్టులో గిల్లీ, మార్టిన్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో గిల్లీ-డామియన్ ఆల్‌టైమ్ రికార‍్డును ఖావాజా-స్మిత్ బ్రేక్ చేశారు.

కాగా ఇప్పటికే వరల్డ్‌ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని 3-1 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియాకు ఇదే ఆఖరి సిరీస్‌. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. స్టీవ్‌​ స్మిత్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా ఆడుతోంది.
చదవండి: RT 2025: హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్‌.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)