Breaking News

భార‌త్ చేతిలో ఓట‌మి.. స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Published on Wed, 03/05/2025 - 12:02

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. వ‌న్డే క్రికెట్‌కు స్మిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 సెమీఫైన‌ల్లో భార‌త్ చేతిలో ఓట‌మి అనంత‌రం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ పరాజయం పాలైంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌గా స్మిత్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇ‍చ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్మిత్‌ తెలిపాడు.

"వన్డేల్లో నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో భాగంగా ఉండడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఎంతోమంది సహచరలతో కలిసి నా క్రికెట్ జర్నీని కొనసాగించాను. 2027 వన్డే ప్రపంచకప్‌కు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.

అందుకే వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాను. ముఖ్యంగా అ‍త్యున్నతస్ధాయిలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు గర్వకారణమే. ఎల్లో జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఆనుభూతిని వర్ణించలేం.  నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలు.

ఇకపై టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుం‍టున్నాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను  అంటూ స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా 2015, 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యునిగా ఉన్నాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)