Breaking News

AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్‌ వార్నర్‌కు ఛాన్స్‌

Published on Tue, 02/06/2024 - 08:48

న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్న ఆసీస్ సీనియర్‌ పేస్‌ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్‌ తిరిగి కివీస్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 

అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డే, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్‌ వార్నర్‌కు సైతం ఈ జట్టులో చోటు దక్కింది.

టీ20 ప్రపంచకప్‌-2024 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్‌ జరగనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 21న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక టీ20 సిరీస్‌ అనంతరం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా బ్లాక్ క్యాప్స్‌తో కంగారులు ఆడనున్నారు. కాగా ఆసీస్‌ జట్టు ప్రస్తుతం విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0తో ఆసీస్‌ సొంతం చేసుకుంది.

కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్‌ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
చదవండి:
 IND vs ENG: రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్‌కు వెళ్లనున్న ఇంగ్లండ్‌ జట్టు? ఎందుకంటే?

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)