Breaking News

రష్మిక సంచలనం

Published on Wed, 02/05/2025 - 03:45

ముంబై: ఎల్‌ అండ్‌ టి ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక  సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 325వ ర్యాంకర్‌ రష్మిక  6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్‌ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక  కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్‌లు సంధించిన రష్మిక  మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక  ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసింది. ఓవరాల్‌గా మ్యాచ్‌ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. 

భారత్‌కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్‌ కూడా తొలి రౌండ్‌లో నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్‌ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్‌ (బెలారస్‌)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై విజయం సాధించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)