Breaking News

భారత్‌ 0 స్వీడన్‌ 2

Published on Sun, 09/15/2024 - 04:16

స్టాక్‌హోమ్‌: డేవిస్‌కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నీ వరల్డ్‌ గ్రూప్‌–1లో భాగంగా స్వీడన్‌ జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులకు ఓటమి ఎదురైంది. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన స్వీడన్‌ నేడు జరిగే ఒక డబుల్స్‌ మ్యాచ్, రెండు రివర్స్‌ సింగిల్స్‌లలో ఒక విజయం సాధిస్తే గెలుపును ఖరారు చేసుకుంటుంది. 

వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది. తొలి సింగిల్స్‌లో ‘డబుల్స్‌ స్పెషలిస్ట్‌’ శ్రీరామ్‌ బాలాజీ 4–6, 2–6తో ప్రపంచ 238వ ర్యాంకర్‌ ఇలియాస్‌ యెమెర్‌ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 3–6, 3–6తో లియో బోర్గ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 

సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ వెన్నునొప్పితో స్వీడన్‌తో పోరు నుంచి వైదొలిగాడు. దాంతో సుమిత్‌ స్థానంలో శ్రీరామ్‌ను ఆడించాల్సి వచ్చింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిస్తేనే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందడం రెండుసార్లు (2010లో బ్రెజిల్‌పై, 2018లో చైనాపై) మాత్రమే జరిగింది.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)