Breaking News

శ్రీనివాస్‌ ‘ట్రిపుల్‌’ ధమాకా... క్యారమ్‌ ప్రపంచకప్‌లో స్వర్ణాలన్నీ భారత్‌కే

Published on Wed, 12/10/2025 - 00:30

సాక్షి, హైదరాబాద్‌: క్యారమ్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ఆటగాడు శ్రీనివాస్‌ ‘ట్రిపుల్‌’ ధమకా సాధించాడు. మాల్దీవులులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అతను మూడు పతకాలు సాధించడం విశేషం. స్విస్‌ లీగ్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్‌ ప్లేయర్‌... పురుషుల డబుల్స్‌లో అభిజిత్‌ త్రిపాంకర్‌తో కలిసి టైటిల్‌ సాధించాడు. పురుషుల వ్యక్తిగత ఫైనల్లో ప్రశాంత్‌ మోరే చేతిలో ఓడిపోవడంతో రజతం సాధించాడు. 

టైటిల్‌ పోరులో హైదరాబాదీ ప్లేయర్‌ 25–5, 11–25, 18–25తో ప్రశాంత్‌ మోరె చేతిలో కంగుతిన్నాడు. తద్వారా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో శ్రీనివాస్‌ ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. బంగారు పతకాలన్నీ భారత జట్టుకే లభించడం మరో విశేషం. పురుషుల డబుల్స్‌లో స్వర్ణంతో పాటు రజతం కూడా భారత జోడీలకే దక్కాయి.
దీంతో భారత్‌ 7 పసిడి పతకాలు సహా 4 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 14 పతకాలు నెగ్గింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)